దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్
NEWS Dec 09,2025 08:19 pm
ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫోటో, పేరును వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు పర్మిషన్ లేకుండా కొన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్, ఈ కామర్స్ సంస్థలు తన ఫోటోలను అనధికారికంగా ఉపయోగిస్తున్నారని.. దాంతో తన వ్యక్తిగత హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్టీఆర్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పేర్కొంది.