ఆధార్ అప్‌డేట్ కోసం కొత్త యాప్
NEWS Dec 09,2025 01:34 pm
ఆధార్ కార్డు వివరాలను సవరణ కోసం ఇంట్లో నుంచే మార్పులు చేసుకునేందుకు మొబైల్ యాప్ వచ్చింది. యాప్‌లోని ఫేస్ అథెంటికేషన్ ద్వారా తమ గుర్తింపును ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాత ₹75 ఫీజు చెల్లించి కొత్త మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ కోసం రిక్వెస్ట్ పంపవచ్చు. 30 రోజుల్లోగా కొత్త నంబర్ ఆధార్‌తో లింక్ అవుతుంది. పేరు, అడ్రస్ వంటి ఇతర వివరాలను కూడా త్వరలోనే మార్చుకోవచ్చని యూఐడీఏఐ అధికారులు తెలిపారు.