హైదరాబాద్ పేరును 'భాగ్యనగర్'గా మార్చాలి
NEWS Dec 08,2025 12:07 pm
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం పక్కన ఉన్న కీలక రహదారికి "డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ"గా నామకరణం చేయాలని, మరిన్ని రోడ్లకు పేర్లు మార్చాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ముందుగా హైదరాబాద్ పేరును 'భాగ్యనగర్'గా మార్చాలని డిమాండ్ చేశారు. "ట్రెండింగ్‌లో ఉన్నవారి పేర్లను రేవంత్ రెడ్డి పెడుతున్నారు" అని X వేదికగా విమర్శించారు. ఈ పేర్ల మార్పు ప్రతిపాదన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.