హైదరాబాద్‌లో ఓ రోడ్డుకు ట్రంప్ పేరు
NEWS Dec 08,2025 11:58 am
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం పక్కన ఉన్న కీలక రహదారికి "డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ"గా నామకరణం చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌ను టెక్ హబ్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించిన అంతర్జాతీయ సంస్థలు, వ్యాపారవేత్తలను గౌరవించేందుకు ప్రభుత్వం పేర్లను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా ఓ ప్రధాన మార్గానికి 'గూగుల్ స్ట్రీట్' అని, మరికొన్నింటికి 'మైక్రోసాఫ్ట్ రోడ్', 'విప్రో జంక్షన్' అని పేర్లు పెట్టే యోచనలో ఉంది.