'తెలంగాణ రైజింగ్' గ్లోబల్ సమ్మిట్ షురూ
NEWS Dec 08,2025 11:36 am
హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్' షురూ అయింది. మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారు. 2 రోజుల సదస్సు ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం. ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి సుమారు 154 మంది అంతర్జాతీయ గెస్టులతో పాటు దేశవ్యాప్తంగా 2,000 మంది ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారు.