వైఎస్ఆర్సీపీ నేతల సంతకాల సేకరణ
NEWS Dec 07,2025 08:53 pm
మిట్టపాలెం గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమాన్ని ఉపసర్పంచ్ మండవ మాలకొండయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్ ఆదేశాలపై ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజా ఆస్తులను రక్షించాలనే లక్ష్యంతో గ్రామస్తులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు సంతకాలు చేశారు.