ఇక్కడ పరాయి విగ్రహాలు సహించం
NEWS Dec 07,2025 09:24 am
హైదరాబాద్: “సమైక్యవాదుల విగ్రహాలా? తెలం గాణ యోధుల విగ్రహాలా?” అనే ప్రధాన అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని తెలంగాణ క్రాంతి దళ్ నిర్వహించింది. ఈ సందర్భంగా పాల్గొన్న మేధావు లు, కళాకారులు, పలు సంఘాల ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు ఏకాభిప్రాయాన్ని తెలంగాణ గడ్డపై తెలంగాణ యోధులు, మహనీయులు, పోరాట యోధుల విగ్రహాలే ప్రతిష్టించాలి అని వారు స్పష్టం చేశారు.