నా పనులే నన్ను గెలిపిస్తాయి: ఆకుల గట్టయ్య
NEWS Dec 07,2025 05:49 pm
పెద్దపల్లి/కమాన్‌పూర్: గుండారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆకుల గట్టయ్య ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, గతంలో సర్పంచ్‌గా చేసిన అభివృద్ధే తాను విజయం సాధించే బలం అని తెలిపారు. స్ట్రీట్ లైట్స్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్కూల్ భవనాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేసి, నీటి కొరతను తీర్చినట్టు పేర్కొన్నారు. మంగపేట బ్రిడ్జిని పూర్తి చేస్తానని హామీ ఇచ్చి, ఉంగరం గుర్తుకు ఓటు ఇవ్వాలంటూ గ్రామస్తులను కోరారు.