సచిన్ మరో రికార్డు బద్దలు
NEWS Dec 07,2025 10:25 am
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో మెరిసిన కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డును అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికసార్లు పొందిన ఆటగాడిగా అతను అవతరించాడు. సౌతాఫ్రికా సిరీస్‌లో 302 పరుగులు (135, 102, 65*) చేసిన కోహ్లీ తన ఖాతాలో 20వ సిరీస్ అవార్డు వేసుకొని సచిన్ (19) రికార్డును అధిగమించాడు. జాబితాలో షకీబ్ అల్ హసన్, కల్లిస్, జయసూర్య తదుపరి స్థానాల్లో ఉన్నారు. వన్డేల్లో కోహ్లీకి ఇది 11వ సిరీస్ అవార్డు.