సావిత్రి లాంటి నటీమణులు లేరు..
NEWS Dec 07,2025 10:06 am
మంచి కథతో తీసిన సినిమాలను తాను సహా ప్రేక్షకులందరూ ఎప్పటికీ ఆదరిస్తారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సావిత్రి 90వ జయంతి వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య, కంటితోనే కోటి భావాలు ప్రసరించే నవరసాల నటి సావిత్రి వంటి వారెవరూ ఇప్పుడులేరని అన్నారు. అప్పటి సినిమాల్లో హీరోహీరోయిన్లు తాకకుండానే శృంగారాన్ని పండించేవారని, ఇప్పుడు తాకినా గోకినా కూడా ఏమీ అనిపించకపోవడం కాలం మార్పుని సూచిస్తున్నదని వ్యాఖ్యానించారు.