అడవితల్లీ బాట పూర్తిఅయ్యేది ఎప్పుడో?
NEWS Dec 07,2025 10:00 am
అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం రెగం గ్రామానికి రోడ్డు పూర్తిచేయాలని స్థానిక గిరిజనులు శనివారం నిరసన తెలిపారు. ‘అడవి తల్లి బాట’ పేరుతో ప్రభుత్వం పనులు ప్రారంభించినా, సంవత్సరం గడిచినా రహదారి పూర్తి కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి దురస్థితితో ప్రయాణం నరకం వంటి అనుభవమైపోతోందని వాపోయారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి గ్రామానికి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.