గ్రామాల్లో ప్రభుత్వ పధకాల ప్రచారం
NEWS Dec 07,2025 10:00 am
అనంతగిరి మండలంలోని కివర్ల పంచాయతీ పరిధిలో టీడీపీ నేతలు సంక్షేమ పథకాలపై ప్రచారం నిర్వహించారు. పంచాయతీ టీడీపీ–తెలుగు రైతు అధ్యక్షుడు కొండతమల లక్ష్మణరావు, యువనేత కోటా నాగేష్ చీడిగరువు గ్రామాన్ని సందర్శించి రైతులకు అందిన ‘అన్నదాత సుఖీభవ’ లబ్ధులను తెలుసుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించి, కార్మికులకు సహాయం చేశారు. పీవీటీజీ గిరిజనులు సర్పంచ్‌గా పోటీ చేయాలని కోరుతున్నట్లు లక్ష్మణరావు తెలిపారు.