అమెజాన్ ప్రైమ్‌లోకి ‘నాన్నా మళ్లీ రావా’
NEWS Dec 06,2025 08:45 am
‘నాన్నా మళ్లీ రావా’ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కమల్ క్రియేషన్స్‌పై ఉమారావు నిర్మాణంలో నిర్దేష్ దర్శకత్వం వహించారు. సత్యప్రకాశ్, ప్రభావతి, రిత్విక్ తదితరులు నటించారు. ఏప్రిల్ 11న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. షూటింగ్ టైంలో గ్లిజరిన్ అవసరం లేకుండా నిజంగానే కన్నీళ్లు వచ్చేవని సత్యప్రకాశ్ తెలిపారు. ఈ మూవీకి ఓటీటీలో కూడా మంచి స్పందన వస్తోంది. మూవీ లింక్ http://bit.ly/3YbARpv