వచ్చే పది రోజులు గజగజ వణకాల్సిందే..
NEWS Dec 06,2025 01:34 pm
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో ఇప్పటికే చలి పంజా విసురుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే పదిరోజులు చలితీవ్రత విపరీతంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.