చిరంజీవి - నయనతార జంటగా వస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు” మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి శశిరేఖ అనే పాట ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో పంచకట్టులో పెళ్లి కొడుకు గెటప్ లో కనిపించాడు మెగాస్టార్. ఇక తెల్ల శారీలో నయనతార కూడా ఒక రేంజ్ ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.