ఇంటింటికీ ఫ్రీ వైఫై, టీవీ ఛానల్స్..
బాండ్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్థి
NEWS Dec 06,2025 12:19 pm
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్లను ఆకర్షించేందుకు సర్పంచ్ అభ్యర్థులు స్థాయికి మించిన హామీలు ఇస్తున్నారు. అయితే ఇచ్చిన హామీలపై బాండ్లు రాసిచ్చేవారు అరుదు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి, ఆమె భర్త చక్రవర్తి ఇంటింటికీ వైఫై, ఐదేళ్లు టీవీ ఛానల్స్ ఫ్రీగా అందిస్తామని బాండ్ రాసిచ్చారు. కోతుల బెడద, ఇతర సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.