ఎంతమంది EMIలు కడుతున్నారో తెలుసా?
NEWS Dec 06,2025 11:24 am
దేశంలో 28.3 కోట్ల మంది అప్పుల్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏడేళ్లలో భారీగా పెరిగారని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో తెలిపారు. 2017-18లో 12.8 కోట్ల మంది అప్పుల్లో ఉన్నారని పేర్కొన్నారు. 2025లో కుటుంబ రుణాలు ₹15.7 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. 2018లో సగటున ఒక్కొక్కరిపై ₹3.4 లక్షల అప్పు ఉండగా, ఇప్పుడు ₹4.8 లక్షలకు పెరిగింది. ఈ లెక్కన దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు EMIలు కడుతున్నారు.