రాహుల్, ఖర్గేను కాదని శశిథరూర్‌కు ఆహ్వానం
NEWS Dec 05,2025 08:45 pm
రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక విందుకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను కేంద్రం ఆహ్వానించింది. విదేశీ ప్రతినిధులు భారత్‌లో పర్యటించినప్పుడు అపోజిషన్ లీడర్లను పిలిచే సంప్రదాయానికి మోదీ సర్కారు చరమగీతం పాడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. పుతిన్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఇస్తున్న ఈ విందుకు కాంగ్రెస్ నేత రాహుల్, AICC ప్రెసిడెంట్ ఖర్గేను ఆహ్వానించలేదు.