టీచర్స్, పేరెంట్స్ ఆత్మీయ సమ్మేళనం
NEWS Dec 05,2025 09:48 pm
అనంతగిరి (మం) జీనబాడు బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పాఠశాల హెచ్‌ఎం మల్లేశ్వరి, పాఠశాల యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత స్థాయికి ఎదగగలరని హెచ్‌ఎం మల్లేశ్వరి సూచించారు. అనంతరం విద్యార్థినులు పేరెంట్స్‌కు స్వాగత గీతం పాడి ఆహ్వానించారు. తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా కొనసాగి అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థినుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.