పెరిగిన బంగారం ధర.. తగ్గిన సిల్వర్ రేటు!
NEWS Dec 05,2025 02:41 pm
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా.. సిల్వర్ రేటు భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 270 పెరిగి రూ.1,29,930కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.250 ఎగబాకి రూ.1,19,100 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 తగ్గి రూ.1,96,000గా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.