భారత్ తటస్థం కాదు.. శాంతిపక్షం
NEWS Dec 05,2025 02:22 pm
భారత్ తటస్థంగా లేదని శాంతిపక్షాన ఉందని రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పుతిన్, రష్యా ప్రతినిధి బృందాన్ని స్వాగతించిన మోదీ.. ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన దగ్గరి నుంచి తమ ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయన్నారు. ఇరు దేశాల బంధం దశాబ్దాల క్రితమే పెనవేసుకుందని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి సంబంధించిన వివరాలను భారత్‌తో షేర్ చేసుకున్నామన్నారు.