ఇందిరమ్మ ఇళ్లపై పొంగులేటి శుభవార్త
NEWS Dec 05,2025 01:54 pm
త్వరలో లక్ష ఇళ్లకు గృహప్రవేశం చేస్తామని, వచ్చే మార్చి నాటికి 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. త్వరలో అర్బన్ ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు చేపడతామన్నారు. గ్రౌండ్ ప్లస్ ఫోర్ బిల్డింగ్ విధానంలో ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చేందుకు ప్లాన్స్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. ORRను అనుకుని నలువైపులా ఉన్న స్థలాల్లో ఒక్కోచోట 10 వేల ఇల్లు నిర్మించి నో ప్రాఫిట్, నో లాస్ విధానంలో మధ్యతరగతి ప్రజలకు అందిస్తామన్నారు. త్వరలో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించే విషయంపై దృష్టి పెడతామని, ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం లేని పేదలకు కూడా త్వరలోనే శుభవార్త అందుతుందని పొంగులేటి అన్నారు.