విశాఖ మ్యాచ్ టికెట్లపై కోహ్లీ ఎఫెక్ట్
NEWS Dec 05,2025 01:47 pm
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య 3 వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ విశాఖపట్నం వేదికగా శనివారం జరగనుంది. కోహ్లీ రాంచీ, రాయ్‌పుర్‌లలో వరుస సెంచరీలతో కదం తొక్కాడు ‘టికెట్ల విక్రయం నవంబర్ 28న ప్రారంభమైంది. మొదట్లో మేం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కానీ కోహ్లీ రాంచీలో సెంచరీ చేసిన తర్వాత.. 2, 3 విడతల్లో అమ్మకానికి పెట్టిన టికెట్లన్నీ నిమిషాల్లో అమ్ముడుపోయాయి’ అని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీడియా & ఆపరేషన్స్ టీమ్ అధికారి వెంకటేశ్ తెలిపారు.