పుతిన్ కు స్వాగతం పలికిన మోదీ
NEWS Dec 04,2025 09:33 pm
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్నారు. పాలం ఎయిర్ స్టేషన్‌లో ప్రధాని మోదీ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. పుతిన్, మోదీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇరుదేశాల 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఇరువురు దేశాధినేతలు భేటీ అవుతారు. అణువిద్యుత్‌తో సహా పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరుగనున్నాయి.