కొత్తపల్లి జలపాతానికి స్నేహితుల సందర్శన
NEWS Dec 04,2025 12:54 pm
పాడేరు మండలం సమీపంలోని కొత్తపల్లి జలపాతాన్ని వడ్డాది ప్రాంతానికి చెందిన స్నేహితుల బృందం సందర్శించింది. పచ్చని ప్రకృతి మధ్య పొంగిపొర్లే జలపాతం వారి హృదయాలను హత్తుకుంది. ప్రత్యేకంగా ఈ సీజన్ కారణంగా నీటి ప్రవాహం పెరగడంతో కొత్తపల్లి జలపాతం అద్భుతమైన అందాలతో అలరించింది. రోజురోజుకూ సందర్శకుల రద్దీ పెరుగుతూ, ఈ ప్రదేశం పర్యాటకులతో కిటకిటలాడుతోంది.