రూపాయి తగ్గితే ఏమౌతుంది?
NEWS Dec 04,2025 11:55 am
అమెరికా డాలర్‌తో పోల్చితే మన రూపాయి విలువ చరిత్రలో తొలిసారి ₹90 దాటి పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థపై పలు ప్రభావాలు కనిపిస్తున్నాయి. రూపాయి బలహీనతతో క్రూడ్ ఆయిల్, బంగారం, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు వంటి దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెరగడంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. విదేశీ విద్య, ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. విదేశీ రుణాల వ్యయం పెరిగి ప్రభుత్వానికి, కంపెనీలకు భారమవుతుంది.