రికార్డు స్థాయిలో పడిన రూపాయి విలువ
NEWS Dec 04,2025 11:52 am
దేశీయ కరెన్సీ రూపాయి విలువ కొనసాగుతూ పడిపోతోంది. గురువారం ట్రేడింగ్‌లో రూపాయి 28 పైసలు తగ్గి డాలర్‌తో పోలిస్తే 90.43కు చేరుకొని ఆల్‌టైం కనిష్ఠాన్ని తాకింది. క్రితం సెషన్‌లో ఇది 90.15 వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడులు తగ్గడం, దిగుమతుల కోసం భారీగా డాలర్ల కొనుగోలు జరగడం రూపాయి విలువపై ఒత్తిడి పెంచుతున్నాయి. విశ్లేషకులు రూపాయి ఇంకా 90.70-91 వరకు పడే అవకాశముందని చెబుతున్నారు.