20-21 తేదీల్లో ఏకాగ్రా చెస్ టోర్నమెంట్
NEWS Dec 03,2025 03:39 pm
HYD: డిసెంబర్ 20-21 తేదీల్లో హైటెక్స్ లో ‘ఏకాగ్రా ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ చెస్ టోర్న మెంట్’ను ఏకాగ్రా చెస్ అకాడమీ నిర్వహిస్తోంది. టోర్నమెంట్‌లో ₹22,22,222 నగదు అందిస్తున్న ట్టు ఏకాగ్రా వైస్ చైర్మన్ షరీఫ్ మహ్మద్ చెప్పారు. ఎంట్రీ ఫీజు ₹5,000గా, GM, IM, WGM, WIM లకు ఉచితంగా నిర్ణయించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రే షన్ డిసెంబర్ 15 వరకూ అందుబాటులో ఉంది. ఇప్పటికే నెదర్లాండ్స్, రష్యా, బల్గేరియా వంటి దేశాల గ్రాండ్ మాస్టర్లు నమోదు చేసుకున్నారు. ఈవెంట్ ద్వారా ప్రతిభావంతులను స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.