మహిళా పోలీసులకు అవగాహన కార్యక్రమం
NEWS Dec 03,2025 10:50 pm
కొండేపి సర్కిల్ ఆఫీసులో సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మహిళల భద్రతకు సంబంధించిన అంశాలు, గ్రామాలు, పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని వివరించారు. ముఖ్యంగా శక్తి యాప్ డౌన్‌లోడ్, దాని ఉపయోగం, మహిళలపై జరిగే వివిధ నేరాల నివారణపై మహిళా పోలీసులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.