పీఎం మోదీని కలిసిన రేవంత్
గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానం
NEWS Dec 03,2025 03:12 pm
ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీని కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.