అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ చిన్న వయసులోనే అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా అసాధారణ ప్రతిభ కనబరిచి నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. అల్లు అర్హ 30 చెస్ పజిల్స్‌ను పరిష్కరించడంలో ఏకంగా 50 మంది విద్యార్థులకు విజయవంతంగా శిక్షణ ఇచ్చింది. ఇంత చిన్న వయసులో ఆమె ప్రదర్శించిన ఈ నైపుణ్యానికి గుర్తింపుగా ఈ రికార్డు దక్కింది.