తెలంగాణ అమరుడా.. శ్రీకాంతా చారి
నిను మరువబోదు ఈ గడ్డ..
NEWS Dec 03,2025 10:34 am
అమరుల బలిదానాలతోనే తెలంగాణ స్వప్నం సాకారం అయింది. స్వరాష్ట్ర సాధనకు మలి దశ ఉద్యమం (2009)లో ఆత్మార్పణ చేసుకున్న తొలి ఉద్యమకారుడు శ్రీకాంతా చారి. చావు బతుకుల్లోనూ ‘బతికినా మళ్లీ తెలంగాణ కోసం చస్తా’ అన్న ఆయన వ్యాఖ్యలు కోట్లాది మందిలో ఉద్యమకాంక్షను రగిల్చాయి. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలు ఏకతాటిపైకి వచ్చి నిప్పు కణికలై ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నారు. ఇవాళ శ్రీకాంతాచారి వర్ధంతి.