శ్రీలంకకు పాక్ ‘ఎక్స్‌పైరీ’ సాయం?
NEWS Dec 02,2025 11:21 pm
తుపాను ప్రభావంతో అల్లాడుతున్న శ్రీలంకకు సాయంగా ఆహారం, ఔషధాలను పాకిస్థాన్ పంపించింది. ‘‘శ్రీలంకకు పాకిస్థాన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది’’ అని ముద్రించిన ప్యాకెట్లను శ్రీలంకలోని పాకిస్థాన్ హైకమిషన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్యాకెట్లపై గడువు తేదీ 2024 అక్టోబర్‌లోనే ముగిసినట్లు తెలిసింది. వీటిని గమనించిన శ్రీలంక అధికారులు.. ఈ విషయాన్ని పాక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు తమ అసంతృప్తిని తెలిపినట్లు సమాచారం. తాజా పరిణామాలపై పాక్ నుంచి స్పందన రాలేదు.