దిత్వా విధ్వంసం: శ్రీలంకలో పెను విషాదం
NEWS Dec 02,2025 11:13 pm
శ్రీలంకలో దిత్వా తుఫాన్ పెను విషాదాన్ని మిగిల్చింది. కుండపోత వర్షాలు, వరదల బీభత్సం, కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 465 మంది చనిపోయినట్లు లంక ప్రభుత్వం తెలిపింది. మరో 366 మంది గల్లంతయినట్లు పేర్కొంది. ఈ విపత్కర పరిస్థితితో శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించింది. భారత ప్రభుత్వం చేసిన సాయాన్ని మరువలేమని దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య కృతజ్ఞతలు తెలిపాడు.