'హిందూ దేవుళ్లను రేవంత్ అవమానించారు'
NEWS Dec 02,2025 11:02 pm
హిందువులంటే కాంగ్రెస్‌కు ద్వేషమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. CM రేవంత్ హిందూ దేవుళ్లను అవమానించారని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ MIMకి మోకరిల్లింది. తమది ముస్లింల పార్టీ అని రేవంత్ కూడా అన్నారు. BRS కూడా హిందువులను కించపరిచింది. కానీ BJP ఇతర మతాల్ని అవమానించలేదు. హిందువులు ఇలా అవమానాన్ని భరిస్తూనే ఉంటారా లేదా ఒక్కటవుతారా’ అని పేర్కొన్నారు.