కివర్లలో రెండో రోజు పింఛన్ పంపిణి.
NEWS Dec 02,2025 09:19 pm
అనంతగిరి మండలంలో కివర్ల పంచాయతీ సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణి రెండో రోజు మంగళవారం కొనసాగింది. సోమవారం పంపిణీలో మిగిలిన కివర్ల, నక్కుల మామిడి, బుడ్డిగురువు గ్రామాల గిరిజనులకు వారి ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందజేశామని సిబ్బంది తెలిపారు. పింఛన్లు ప్రతి అర్హుడి దాకా చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కివర్ల పంచాయతీ టీడీపీ తెలుగు రైతు అధ్యక్షుడు కొండతమాల లక్ష్మణరావు, టీడీపీ నాయకుడు కోటా నాగేష్, సర్వేయర్ సునీత పాల్గొన్నారు.