అమెరికా, కెనడా పర్యటనకు
వెళుతున్న మంత్రి నారా లోకేశ్
NEWS Dec 02,2025 06:22 pm
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో ఆయన అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఇద్దరు ఉన్నతాధికారులు కార్తికేయ మిశ్రా, అభిషిక్త్ కిశోర్ కూడా పాల్గొననున్నారు. వీరిద్దరి పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.