ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ దిష్టి తగిలిందంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. పవన్ క్షమాపణ చెప్పకపోతే.. తెలంగాణలో ఆయన సినిమాలు కూడా ఆడవని హెచ్చరించారు. రాజకీయ అనుభవం లేకే పవన్ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల దిష్టి కాదు.. ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారన్నారు.