వంటల వీడియోలతో 3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది ‘విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్’. తమిళనాడులోని ఓ గ్రామానికి చెందిన సుబ్రమణియన్, అయ్యనార్, పెరియతంబి, మురుగేశన్, ముత్తుమాణిక్యం, తమిళ్‌సెల్వన్ 2018లో దీన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున వంటలు చేస్తూ పోస్టు చేసేవారు. 2021 అసెంబ్లీ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ ఛానల్ సభ్యులతో కలిసి వంట చేసిన వీడియో వైరల్‌గా మారి కోటి సబ్‌స్క్రైబర్లను పొందింది. తాజాగా 3 కోట్లు దాటింది.