ఈ నెల 19న తెలుగులో ‘అవతార్ 3’
NEWS Dec 01,2025 10:25 pm
ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న జేమ్స్ కామెరూన్ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ రీలీజ్‌కు సిద్ధమైంది. ఈ మూవీకి సంబంధించిన ఐమ్యాక్స్ అడ్వాన్స్ బుకింగ్స్ డిసెంబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 19న ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. తొలి సారిగా డాల్బీ విజన్ టెక్నాలజీతో వస్తున్న ఈ సినిమా అపూర్వమైన విజువల్ అనుభూతిని అందించనుంది. ‘అవతార్’ మూడో భాగం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.