సమంత-రాజ్ భూతశుద్ధి పెళ్లి ఇలా..
NEWS Dec 01,2025 08:22 pm
సమంత–రాజ్ నిడిమోరు భూతశుద్ధి పద్ధతిలో కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో లింగ భైరవి ఆలయంలో జరిగిన ఈ వివాహం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. యోగ సంప్రదాయానికి చెందిన ఈ భూతశుద్ధి వివాహం దంపతుల మధ్య భావోద్వేగాలకు అతీతంగా లోతైన ఆధ్యాత్మిక బంధం ఏర్పడేందుకు ప్రత్యేక క్రతువుగా భావిస్తారు. పంచభూతాల శుద్ధి, మంత్రోచ్చారణలు, యోగిక క్రతువులతో వధూవరుల శరీరం, మనసు, జీవశక్తి సమన్వయం అవుతుందని నమ్మకం. ఈశా ఫౌండేషన్ మాత్రమే ఈ పద్ధతిలో వివాహాలు చేస్తుంది. గతంలో పలువురు సెలబ్రిటీ జంటలూ ఇలా పెళ్లాడారు.