2 నెలల్లో AI యూనివర్సిటీ: శ్రీధర్ బాబు
NEWS Dec 01,2025 07:43 pm
TG: మరో 2నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సిటీని ప్రారంభించనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఇంజినీరింగ్ చదువులు పూర్తిచేసే విద్యార్థులకు దీని ద్వారా నూతన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. ఏఐ సాంకేతిక దూకుడుతో వారంతా నైపుణ్యాలను పెంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. HYDలో కోవాసెంట్ AI ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు.