పింఛన్ పంపిణిలో ఉద్యోగుల "పాట్లు"
NEWS Dec 01,2025 07:45 pm
అనంతగిరి మండలం పరిధి పంచాయతీలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో ఉద్యోగులు అష్ట, కష్టాలు పడుతున్నారు. మండలంలో గల రొంపల్లి పంచాయతీ చెందిన వెటర్నరీ అసిస్టెంట్, చిలకలగెడ్డ సచివాలయం సంబంధించిన ఇంజనీర్ అసిస్టెంట్ ఆయా గ్రామాలలో పింఛన్ పంపిణీ చేసేందుకు సమీపంలో గల గోస్తాని నదిపై అరకొరగా నిర్మించిన బ్రిడ్జిపై కర్రల నిచ్చెన సాయంతో అతి కష్టం మీద బ్రిడ్జి దాటుకుంటూ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నదిపై ఉన్న వంతెన పూర్తి చేయకపోవడంతో అటుగా వెళ్తున్న ఉద్యోగులు, ఆయా గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.