వాడవాడల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీ
NEWS Dec 01,2025 08:24 pm
AP: సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్‌ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా, 29వ వార్డు పరిధిలో పెన్షన్ల పంపిణీ సజావుగా జరిగింది. 29వ వార్డు టిడిపి అధ్యక్షుడు ఉరికిటి గణేష్ ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేశారు. రామజోగిపేట, భుజంగరావుపేట, ఆంథోనీ నగర్, వెంకటపతి రాజు నగర్, పందిమెట్ట, చందక వీధి తదితర ప్రాంతాల్లో పెన్షన్లు లబ్ధిదారులకు అందించారు. 29వ వార్డు టిడిపి జనరల్ సెక్రటరీ రాయన కూడా పాల్గొన్నారు.