₹73 లక్షలు: ముస్లిం మహిళకు సర్పంచ్ పదవి
NEWS Dec 01,2025 01:48 pm
నల్గొండ (D) చండూరు (M) బంగారిగడ్డ గ్రామ సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేసేందుకు వేలం నిర్వహించారు. గ్రామాభివృద్ధి, కనకదుర్గ ఆలయ నిర్మాణానికి నిధులు సమకూర్చే ఉద్దేశంతో జరిగిన ఈ వేలంలో MD సమీనా ఖాసీం అత్యధికంగా ₹ 73 లక్షలు ప్రకటించారు. దీంతో ఆమెకే సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా దక్కేలా నిర్ణయం తీసుకుని, అభ్యర్థులంతా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సేకరించిన నిధులను ఆలయ నిర్మాణం సహా మౌలిక వసతుల కోసం వినియోగిస్తామన్నారు గ్రామ పెద్దలు.