మహిళలకు ₹ 3 లక్షల వడ్డీ లేని లోన్
NEWS Dec 01,2025 01:38 pm
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని పథకం కింద మహిళలకు వడ్డీ రహితంగా రూ.3 లక్షల వరకు రుణం అందిస్తున్నారు. వ్యాపారం ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ పథకం. గ్రామీణ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం. వైకల్యం ఉన్న మహిళలు, వితంతువులకు రుణ పరిమితిపై ఎలాంటి అడ్డంకులు ఉండవు. 18–55 ఏళ్ల మహిళలు అర్హులు. ఆధార్, ఆదాయ–నివాస, కుల ధ్రువీకరణ పత్రాలు తదితర డాక్యుమెంట్లతో సమీపంలోని బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు.