‘నోటా’కు అందరి కంటే ఎక్కువ ఓట్లు వస్తే..?
NEWS Dec 01,2025 01:21 pm
TG: పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటా (నన్ ఆఫ్ ది ఎబౌ)ను ప్రవేశపెట్టారు. అయితే నిబంధనల ప్రకారం అభ్యర్థులందరి కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలక్షన్‌ను ఎన్నికల సంఘం రద్దు చేయదు. తర్వాతి స్థానంలో ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తుంది. నోటా అనేది కేవలం ఓటరుకు నిరసన తెలిపే హక్కుగానే పరిగణిస్తుంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఉన్న ఈ విధానాన్ని తొలిసారి పంచాయితీ ఎన్నికల్లోనూ ప్రవేశపెట్టారు.