హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. వీరిద్దరు పెళ్లి వేడుక కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి వేడుకకు దాదాపు 30 మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. తన పెళ్లికి సామ్ ఎరుపు రంగు చీర ధరించినట్లుగా టాక్.