ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణి కార్యక్రమం
NEWS Dec 01,2025 01:11 pm
అనంతగిరి (మం) పినకోట పంచాయతీ కేంద్రంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో, అరకు టీడీపీ ఇన్‌చార్జి మరియు విజయనగరం APSRTC జోనల్ చైర్మన్ సియారి దొన్ను దొర ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పంచాయతీ టీడీపీ ప్రధాన కార్యదర్శి జాకేరు అప్పలకొండ, క్లస్టర్ ఇన్‌చార్జి జాకేరు సురేష్‌తో పాటు సచివాలయ సిబ్బంది, పింఛన్ లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. పింఛన్‌లు సక్రమంగా లబ్ధిదారుల చేతులకు చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.