ఏపీలో జిల్లాలను వణికిస్తున్న పురుగు
NEWS Dec 01,2025 07:04 am
ఏపీలో కొత్త పురుగు వ్యాధి వణుకు పుట్టిస్తోంది. స్క్రబ్ టైఫస్ అనే పురుగు కుట్టడం ద్వారా వచ్చే ఈ వ్యాధి శ్రీకాకుళంలో మొదలై రాష్ట్రమంతా వ్యాపిస్తోంది. నేటికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1317 కు చేరినట్లు సమాచారం. తాజాగా ఈ వ్యాధి బారిన పడి విజయనగరానికి చెందిన మహిళ మృతి చెందడంతో భయాందోళనకు గురవుతున్నారు జనం. జ్వరం, వాంతులు, అలసట, దగ్గు లాంటి లక్షణాలు ఉంటాయని ఫీవర్ తగ్గకపోతే పరీక్షలు చేయించుకోవాలి. అంటు వ్యాధి కాదు. లార్వల్ మైట్స్ అనే పురుగుల వల్ల ఈ వ్యాధి సోకుతుంది.